Lord Life Love cover art

Lord Life Love

Lord Life Love

Written by: Kumar
Listen for free

About this listen

Songs by KumarKumar Social Sciences
Episodes
  • ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా by Kumar
    Oct 20 2022

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

    నా పాపము బాప నరరూపివైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2)  ||ఎందుకో||

    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో (2)  ||ఎందుకో||

    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2)  ||ఎందుకో||

    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనంటివే (2)  ||ఎందుకో||

    నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2)  ||ఎందుకో||

    Show More Show Less
    12 mins
  • జీవజలమా ఆత్మనాథుడా by Kumar
    Oct 17 2022

    జీవజలమా ఆత్మనాథుడా - ఎండని నదిలాగా రమ్ము బోధకా - 2
    రండయ్యా బోధకుడా.. - 2
    ఎండని జీవనదిలాగా.. - 2

    1. పాదాల కొలత సరిపోదయ్యా - మోకాళ్ల లోతు సరికాదయ్యా - 2
    ఈతలా మునిగి లేవాలయ్యా - 2
    తేలి తేలి ఆడాలయ్యా - 2
    "రండయ్యా బోధకుడా.. "

    2. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే - 2
    చేరు దాపంతా సంతృప్తియే - 2
    నిలుచు మేరంతా పుష్టికరమే - 2
    "రండయ్యా బోధకుడా.. "

    3. కోట్లకోట్ల జాలర్ల గుంపు - పరుగు పరుగున వల వేయాలి - 2
    పాడి పాడి చేపలు పట్టి - 2
    పరమ దేవునికి ప్రజను చేర్చాలి - 2
    "రండయ్యా బోధకుడా.. "

    4. ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి ధారాళంగా - 2
    ఔషధమవ్వాలి ఆకులన్నీ - 2
    ఆహారమవ్వాలి పండులన్నీ -2
    "రండయ్యా బోధకుడా.. "

    Show More Show Less
    7 mins
  • ఇదిగో దేవుని గొర్రెపిల్లా
    Oct 15 2022

    ఇదిగో దేవుని గొర్రెపిల్లా
    ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
    అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
    గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
    రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
    నీదు ప్రజలను కొనినావు
    అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
    గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
    మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
    నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

    పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
    సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2)  ||అర్హుడవు||

    దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
    యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2)  ||అర్హుడవు||

    దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
    క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2)  ||అర్హుడవు||

    Show More Show Less
    7 mins
No reviews yet