Episodes

  • పరుగెత్తే ప్రతి అడుగు బాలికల చదువుకి భరోసా
    Feb 20 2026

    బాలికలకు నాణ్యమైన విద్య, వైద్యం, ప్రోత్సాహం అందిస్తే.. సమాజంలో గొప్పగా రాణించగలరని భావించి.. వారికి అండగా నిలబడడానికి సేవా భారతి సంస్థ ప్రతి సంవత్సరం “Run For A Girl Child” ను నిర్వహిస్తుందని మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మార్చ్ 1st న గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమాన్ని గురించి, సేవా భారతి తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ జయప్రద దేవి గారు, వాలంటీర్ శిరీష గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు..! అలాగే.. వారు బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కిశోరి’ అనే కార్యక్రమాన్ని గురించి కూడా వివరిస్తున్నారు.. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి! ఈ ఈవెంట్ లో మీరూ భాగస్వాములు కండి!


    When girls are provided with quality education, healthcare, and encouragement, they can achieve great success in society. With this belief, Seva Bharati organizes the “Run For A Girl Child” event every year to support and empower girls. This year, the event will be held on March 1st at Gachibowli. In this podcast, Seva Bharati Telangana State Joint Secretary Jayaprada Devi and volunteer Sirisha share complete details about the event and also explain the special ‘Kishori’ program conducted for the welfare of girl children. Do listen, don't miss it, and be a part of this meaningful event!


    Guests: Jayaprada Devi, Shireesha

    Host: Bharath


    #TALRadioTelugu #RunForAGirlChild #SevaBharati #SupportGirlChild #KishoriProgram #EmpowerGirls #GirlChildEducation #WomenEmpowerment #SaveTheGirlChild #GachibowliEvent #SocialImpact #PodcastAlert #BeTheChange #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    32 mins
  • స్క్రీన్ టైమ్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు, డిజిటల్ డీటాక్స్ తో ప్రయోజనాలు | Ayurvedam - Arogyam - 94
    Feb 18 2026
    పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కళ్లు స్క్రీన్‌ లకే పరిమితమైపోతున్నాయి. దీనివల్ల కలిగే ఒత్తిడి, నిద్రలేమి మనల్ని మెల్లగా అనారోగ్యం వైపు నెట్టేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ డిజిటల్ ప్రపంచం నుండి కాస్త బ్రేక్ తీసుకుంటే.. అంటే 'డిజిటల్ డీటాక్స్' పాటిస్తే మన లైఫ్ ఎంత బాగుంటుంది? అసలు దీన్ని ఎలా మొదలుపెట్టాలి? మన రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయి? వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి.. అస్సలు మిస్ అవ్వకండి!From the moment we wake up in the morning until we go to bed at night, our eyes are constantly fixed on screens. The stress and sleep problems caused by this are slowly pushing us toward poor health. So, what is the solution? What happens if we take a short break from this digital world in other words, follow a “digital detox”? How can we start it? And how can small changes in our daily routine protect our health?Dr. Anupama Uppuluri shares many such interesting insights in this podcast. Do listen… don’t miss it!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadioTelugu #DigitalDetox #ScreenFreeLife #HealthyHabits #StressFreeLife #MindfulLiving #TechBreak #WellnessTips #DrAnupamaUppuluri #TALRadio #HealthAwareness #LifestyleChange #MentalWellbeing #ListenNow #TALRadio #TouchALifeFoundation
    Show More Show Less
    30 mins
  • "పిల్లల భద్రత అందరి బాధ్యత" - పడాల సూర్యప్రసాద్ | Special Interview
    Feb 12 2026

    పిల్లలకు సరైన వయసు లో ,సరైన విషయాలను , సరైన విధంగా , చెప్పాలి అంటున్నారు పడాల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్య ప్రసాద్ గారు..

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ మరియు మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ పడాల ఛారిటబుల్ ట్రస్ట్ ..

    ఇవాళ మన టాల్ రేడియో లో పడాల సూర్య ప్రసాద్ గారు పిల్లల భద్రత గురించి , వారికి వారి శరీరం గురించి, సమాజం గురించి తెలిజేయాల్సిన విషయాలు.. అలాగే పిల్లల భద్రత కోసం వారి సంస్థ చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు .. మిస్ కాకుండా వినండి ...

    Children should be taught the right things at the right age and in the right way, says Padala Surya Prasad, founder of Padala Charitable Trust.

    Padala Charitable Trust is working with the goal of improving the lives of students in government schools, especially in rural and remote villages of Andhra Pradesh and Telangana.

    Today on TALRadio, Padala Surya Prasad shares important insights about child safety, how children should be educated about their bodies, and how they should understand society. He also talks about the awareness programs his organization is conducting to protect children.

    Don’t miss this podcast.

    Guest: Padala Surya Prasad

    Host: Bharath

    #TALRadioTelugu #PadalaSuryaPrasad #PadalaCharitableTrust #ChildSafety #ChildAwareness #ProtectChildren #RuralEducation #GovernmentSchools #AndhraPradesh #Telangana #Podcast #SocialImpact #CommunityAwareness #SafeChildhood #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    48 mins
  • Holistic Lifestyle అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 93
    Feb 11 2026

    మనం తినే ఆహారం, మన ఆలోచనలు, మన నిద్ర.. ఇవన్నీ కలిస్తేనే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్'. కానీ, చాలామందికి అసలు ఈ సంపూర్ణ జీవనశైలిని ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అందుకే, అసలు ఆయుర్వేదం ఈ హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ గురించి ఏం చెబుతుంది? దీనివల్ల మనకి కలిగే లాభాలేంటి? రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి ఎన్నో విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్‌లో వివరిస్తున్నారు… తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి!


    The food we eat, our thoughts, and our sleep all these together make a holistic lifestyle. But many people don’t know how to actually begin living this kind of balanced life.

    So, what does Ayurveda say about a holistic lifestyle? What are the benefits of following it? How can small daily changes in our routine improve our overall health?

    In this podcast, Dr. Anupama Uppuluri explains all these important topics in a simple and clear way. Don’t miss it make sure you listen!

    Host: Renu Sree

    Guest: Dr. Anupama Uppuluri


    Dr.Anupama Contact Details:

    Mobile / WhatsApp: 9100052961


    #TALRadio #HolisticLifestyle #AyurvedaWisdom #HealthyLiving #MindBodyBalance #WellnessJourney #DailyHabits #NaturalHealing #SleepHealth #FoodAsMedicine #MentalWellbeing #AyurvedicLife #HealthAwareness #TALRadioTelugu #TouchALifeFoundation

    Show More Show Less
    34 mins
  • "కొత్త టెక్నాలజీతో ఎలాంటి క్యాన్సర్ అయినా నయమవుతుంది" - డా. మల్లిక్ సింగరాజు | Special Interview
    Feb 5 2026

    క్యాన్సర్... ఈ పేరు వినగానే ఒక తెలియని భయం, ఆందోళన మనల్ని చుట్టుముడతాయి. కానీ సరైన సమయంలో గుర్తించి, సరైన ట్రీట్మెంట్ అందిస్తే దాన్ని ఎదుర్కోవడం పెద్ద విషయమేమీ కాదు! సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింగరాజు గారు. ఒకవైపు సీనియర్ కన్సల్టెంట్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు 'సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్' ద్వారా వేలాది మంది పేదలకు ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మరి ఈ 'వరల్డ్ క్యాన్సర్ డే' సందర్భంగా, క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా? అందుబాటులోకి వచ్చిన అధునాతన చికిత్సలు ఏంటి? అలాగే పేదలకు వైద్యం అందించడంలో ఫౌండేషన్ పాత్ర ఏంటి? వంటి మరెన్నో కీలక విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!


    Cancer often brings fear the moment we hear the word. But with early detection and timely treatment, it is no longer something we cannot fight. Dedicated to spreading awareness and clearing misconceptions, leading oncologist Dr. Singaraju continues to make a real difference beyond his clinical work. Through the Singaraju Cancer Foundation, he has been reaching thousands from underserved communities with free screening camps and access to care. This World Cancer Day, he joins our podcast to speak about early warning signs, modern treatment options, and how the foundation is helping make cancer care reachable for those who need it most. A conversation worth listening to don’t miss it.


    Guest: Dr. Mallik Singaraju

    Host: Bharath


    #TALRadioTelugu #WorldCancerDay #CancerAwareness #EarlyDetection #FightCancer #CancerCare #HealthAwareness #Oncology #CancerScreening #HopeAgainstCancer #SingarajuCancerFoundation #HealthcareForAll #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    25 mins
  • ఆధునిక సమాజం లో ఆయుర్వేదం పై ఉన్న అపోహలు, నిజానిజాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 92
    Feb 4 2026

    ఆయుర్వేదం అనగానే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన మైండ్‌లో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అపోహలు వస్తూ ఉంటాయి. అసలు ఈ మోడ్రన్ బిజీ లైఫ్‌కి ఆయుర్వేదం సెట్ అవుతుందా లేదా? అనే అంశంపై చర్చిస్తూ ఆయుర్వేదం ఉపయోగాల గురించి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. మిస్ అవ్వకండి.. ఇప్పుడే వినేయండి!


    When we hear the word Ayurveda, many questions and misconceptions come to mind, especially about whether it fits into today’s busy modern lifestyle. In this podcast, renowned Ayurveda expert Dr. Anupama Uppuloori shares her insights on how Ayurveda can be practical and beneficial even in our fast-paced lives. Don’t miss this interesting conversation, listen now!

    Host: Renu Sree

    Guest: Dr. Anupama Uppuluri


    Dr.Anupama Contact Details:

    Mobile / WhatsApp: 9100052961


    #TALRadioTelugu #Ayurveda #AyurvedaPodcast #AyurvedaForModernLife #HolisticHealth #NaturalHealing #AncientWisdom #ModernLifestyle #HealthTalk #WellnessPodcast #MindBodyHealth #DrAnupamaUppuloori #IndianHealthcare #HealthyLiving #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    29 mins
  • "పర్యావరణ రక్షణే.. మానవ మనుగడకు సురక్ష" - ప్రసాద్ జాలాది | Special Interview
    Feb 2 2026

    పర్యావరణ పరిరక్షణ గురించి మనం రోజూ ఎన్నో మాటలు వింటూ ఉంటాం.. కానీ ప్రకృతిని కాపాడుకోవడాన్ని ఒక బాధ్యతగా తీసుకుని, మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తోంది సురక్ష ఫౌండేషన్. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఫెసిలిటేటర్ ప్రసాద్ జాలాది గారు, ఒక సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆయన ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో తీసుకొస్తున్న మార్పులు,'సురక్ష' ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. రేపటి తరం కోసం మనం చేయాల్సిన కృషిని గుర్తుచేసే ఈ విశేషాలను తప్పకుండా వినండి! అస్సలు మిస్ అవ్వకండి!


    We often hear many talks about protecting the environment. But Suraksha Foundation is turning these words into action and working responsibly for a better future. In this podcast, the founder and Chief Facilitator Prasad Jaladi shares his journey as a social entrepreneur, the positive changes he is bringing to environmental protection, and the various initiatives taken up through Suraksha. These insights remind us of the efforts we must make for the next generation. Do listen, don’t miss it!


    Host: Renu Sree

    Guest: Prasad Jaladi


    #TALRadioTelugu #SocialEntrepreneur #GreenFuture #SaveNature #SustainableLiving #ClimateAction #EcoResponsibility #ForNextGeneration #EnvironmentalAwareness #ChangeMakers #InspiringStories #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    37 mins
  • "మా ఊరి గంగమ్మ జాతర ఇప్పుడు వరల్డ్ ఫేమస్" - భార్గవి రెడ్డి
    Jan 27 2026

    ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వారం వారం తిరుమల కొండను ఎక్కిన ఆ అనుభూతులు, ఊరి గుడుల మధ్య గడిపిన తీపి జ్ఞాపకాలు, మనసులో నిలిచిపోయిన మరెన్నో ముచ్చట్లు... వీటన్నింటితో పాటు తిరుపతి లో అత్యంత వైభవంగా జరిగే 'తాతయ్యగుంట గంగమ్మ జాతర' విశేషాలను ఈ ‘మా ఊరు’ ఎపిసోడ్ లో మనతో పంచుకుంటున్నారు తిరుపతికి చెందిన భార్గవి రెడ్డి గారు! ఆ జాతర వెనుక ఉన్న కథ ఏంటి, అక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయి, తన ఊరితో తనకున్న అనుబంధం ఏంటి.. వంటి ఎన్నో విషయాలను పంచుకున్న ఈ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి...!


    In this “Ma Ooru” episode, Bhargavi Reddy garu from Tirupati shares her sweet childhood memories, her deep connection with her hometown, and the joy of climbing Tirumala with friends, while also explaining the story, traditions, and cultural importance of the grand Tataiyyagunta Gangamma Jatara celebrated in Tirupati.


    Guest: Bhargavi Reddy

    Host: Usha

    #TALRadioTelugu #MaOoru #Tirupati #GangammaJatara #TirupatiStories #CultureAndTradition #PodcastEpisode #LocalVoices #OurRoots #TALRadio #TouchALifeFoundation

    Show More Show Less
    32 mins